20, మార్చి 2011, ఆదివారం

రాజకీయం లో చీడ పురుగులు - తెలంగాణ కు అడ్డుకట్టలు

రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరు చూసాం....

ఎప్పటి లాగే క్రాస్ వోటింగ్ జరిగింది....కాని నన్ను చాలా భాధకు గురిచేసింది టి.ఆర్.ఎస్ లో జరిగిన క్రాస్ వోటింగ్.

ఉద్యమం ఎన్నడు లేని విధంగా, ఉధృతంగా, ప్రజలనుంచి  జరుగుతున్న ఈ తరుణం లో ముగ్గురు టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే లు కాంగ్రెస్స్ కు వోటు వేయడం చాల భాధాకరం.

మూడు నెలల క్రితం చరిత్రలో అత్యంత భారీ మెజారిటీ తో వీళ్ళని బై ఎలెక్షన్ లో తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకొని మరీ గెలిపించారు..కాని ఈ నాయకులు గిట్ల చేసిండ్రు.

నేను ప్రోదున లేవ్వగానే ఈ న్యూస్ విన్నాను, క్రాస్ వోతిన్క్గ్ కు పాల్పడ్డ ముగ్గురిలో మా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావ్ ఉన్నాడు...నేను వీనికి వోటేసాను,వీడేమో కాంగ్రెస్స్ కు వోతేసాడు...నేను చాల భాధపడ్డా! ఇంకోసారి టి.ఆర్ .ఎస్ కు వోటెయ్య అని ఫిక్స్ ఐపోయాను..

ఎమ్మెల్యేల సైడ్ నుంచి ఆలోచిస్తే పాపం వాళ్ళ పరిస్థితి దారుణం.
2009 అందరి లాగే కోట్లు కర్చు పెట్టి గెలిచారు...కాని సంపాదిచుకునే మార్గం దొరకట్లేదు..ఉద్యమం ఉన్నపుడు వేరే పనులు లేవు,గవర్నమెంట్ కాంట్రాక్టులు లేవు..పార్టీ డబ్బులు లేవు..ఇవన్ని వాళ్ళ ఆశ కు కారనమైనాయి.

ఏదేమైనా ఈ పని తప్పు....

కాని రాత్రి పదకొండు గంటలకు ,టి.ఆర్.ఎస్ పొలిట్ బ్యూరో సమావేశం మంచి నిర్ణయం తీసుకుంది..ఆ ముగ్గుర్ని సస్పెండ్ చేసింది...టి.ఆర్.ఎస్ కు పదవులు ముక్యం కాదని మరోసారి తేల్చింది...

ఈ లంగ లఫంగా నాయకుల వల్లే తెలంగాణ అభివృది కుంతుపద్డది...రాష్ట్ర కాంక్ష వెనక పడ్డాది.

మిమ్మల్ని నమ్మం...తెలంగాణ వచ్చాక మీ వంతు తెలుస్తాం,అభివృది కోసం ప్రజా ఉద్యమాల్ని కొనసాగిస్తాం...ఇది అంతులేని పోరాటం....



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి